ముంబై: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్తాన్ వెళ్లబోదని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. తమ టీమ్‌ను పాక్‌కు పంపవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని ఐసీసీకి సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడం తప్ప పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19– మార్చి 9 మధ్య షెడ్యూల్ చేశారు. ఇండియా తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడే చాన్సుంది.
The BCCI has informed the ICC that India will not travel to Pakistan to participate in the 2025 Champions Trophy https://t.co/0x7mldouQU pic.twitter.com/3S4oM86SWt
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2024