వన్డే వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. 2023 అక్టోబర్ 05 నుండి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో గెలవాలని అన్ని జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి హాట్ ఫేవరేట్ గానే టీమిండియా బరిలోకి దిగబోతుంది. అయితే వరల్డ్ కప్లో టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయో చుద్దాం.
వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటివరకు టీమిండియా 17 దేశాలపై 84 మ్యాచ్లు ఆడింది. ఇందులో 53 మ్యాచ్లలో విజయం సాధించగా, 29 మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. వరల్డ్ కప్లో పాకిస్థాన్ పై టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య 7 మ్యా్చ్లు జరగగా పాకిస్థాన్ పై టీమిండియా ప్రతీ మ్యాచ్ లోనూ గెలిచింది.
Also Read :- డేవిడ్ వార్నర్‌కి పీవీ సింధు వార్నింగ్
ఇక శ్రీలంకతో 8 మ్యాచ్ లు ఆడితే ఇండియా నాలుగింటిలో గెలిచి మరో నాలుగింటిల్లో ఓడింది. ఆస్ట్రేలియాపై 12 మ్యాచ్ లు ఆడితే నాలుగింటిలో గెలిచి 8 మ్యాచ్ ల్లో ఓడింది. ఇంగ్లండ్ పై 7 మ్యాచ్ లు ఆడితే మూడింటిలో గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ఓడింది. న్యూజిలాండ్ తో 8 మ్యాచ్ లు ఆడితే మూడింటిలో గెలిచి 5 మ్యాచ్ ల్లో ఓడింది. వెండీస్ పై 9 మ్యాచ్ లు ఆడితే ఆరింటిలో గెలిచి 3 మ్యాచ్ ల్లో ఓడింది.
ఇక దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్ లు ఆడితే రెండిటిలో గెలిస్తే మూడింటిలో ఓడింది. పసికూన జింబాబ్వేపై 10 మ్యాచ్ లు ఆడితే 9 మ్యాచ్ లు గెలిచి.. ఒక్క మ్యాచ్ లో ఓడింది. బంగ్లాదేశ్ పై నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి ఒక్క మ్యాచ్ లో ఓడింది. ఇక నెదర్లాండ్స్ పై ఆడిన రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియాదే గెలుపు అయింది. ఇప్పటివరకు టీమిండియాకు రెండు సార్లు(1983, 2011) వరల్డ్ కప్ వచ్చింది.