Team India: రెండేళ్లలో 27 వన్డేలు.. 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్

Team India: రెండేళ్లలో 27 వన్డేలు.. 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డేలతో బిజీ కానుంది. 2024 లో కేవలం మూడు వన్డేలకు మాత్రమే పరిమితమైన భారత క్రికెట్ జట్టు ఇకపై ఎక్కువగా వన్డేలపైనే దృష్టి పెట్టనుంది. రానున్న రెండేళ్లలో ఏకంగా 27 వన్డేలు ఆడనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ 50 ఓవర్ల ఫార్మాట్ లో టీమిండియా షెడ్యూల్ ఖరారు చేసింది. షెడ్యూల్ ప్రకారం భారత్ అన్ని జట్లతో సిరీస్ ఆడనుంది. అన్ని కూడా మూడు మ్యాచ్ ల షెడ్యూల్ కావడం విశేషం. 2027 వరల్డ్ కప్ ముందు వరకు భారత క్రికెట్ వన్డే షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియా షెడ్యూల్

-2025ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటన
 
-2025 అక్టోబర్,నవంబర్‌లో మూడు మ్యాచ్‌ల  వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
 
-2025 నవంబర్,డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది.

-2026 జనవరిలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్. ఈ ఇండియాలో ఈ సిరీస్ జరుగుతుంది.
 
-2026 జూన్‌లో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌

-2026 జూలైలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ 

-2026 సెప్టెంబర్,అక్టోబర్ లో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్

-2026 అక్టోబర్,నవంబర్‌లో మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ లో జరగనుంది. 

-2027 జనవరిలో శ్రీలంకతో స్వదేశంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా మార్చి 22 నుంచి ఐపీఎల్ తో బిజీ కానున్నారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.సెప్టెంబర్ లో టీ20 ఫార్మాట్ లో ఆసియా కప్ జరుగుతుంది. 2026 లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది.