సరుకుల్​ వాళ్లకు.. ఆయిల్​ మనకు

ట్రేడ్​ లావాదేవీలన్నీ అమెరికన్​ డాలర్​తోనే జరుగుతుంటాయి. మన దేశం మాత్రం ఫారిన్​ ఎక్స్​చేంజీని బయటకు తీయకుండా రూపాయలతో ఇరాన్​ నుంచి ఆయిల్​ కొనుక్కుంటోంది. ఈ సదుపాయం ఇండియా–ఇరాన్​ల మధ్యనే ఉంది. మన దేశానికి చమురు సప్లయి చేసే దేశాల్లో ఇరాన్​ మూడో పెద్ద దేశం.  యూకో బ్యాక్​ లేదా ఐడీబీఐ ద్వారా ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ), మంగళూరు రిఫైనరీ (ఎంఆర్పీఎల్) చమురు తెచ్చుకుంటున్నాయి. అమెరికా ఫైనాన్షియల్​ సిస్టంలో ఆ బ్యాంకులకే గుర్తింపు ఉంది.

ఆ తర్వాత (2018లో) ఇరాన్​తో చేసుకున్న న్యూక్లియర్​ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుని ఫస్ట్​ రౌండ్​ ఆంక్షలు విధించింది. ఆ దేశంతో లావాదేవీలు సాగించే దేశాల్నికూడా వదలనని హెచ్చరించింది. దాంతో యూరోపియన్​ బ్యాంక్​లద్వారా యూరోలలో ఇరాన్​కి పేమెంట్​ చేసింది ఇండియా.  ఇరాన్​ మన దేశానికి 60 రోజులపాటు పేమెంట్​కి వెసులుబాటు కల్పిస్తుంది. అంటే, జనవరిలో ఆయిల్​ ఇచ్చి, మార్చిలో పేమెంట్​ తీసుకుంటుంది.  మన దగ్గర తీసుకున్న రూపాయలతో ఇరాన్​ తిరిగి మన నుంచే ఆహార పదార్థాలను, ఎక్విప్​మెంట్​ను కొంటుంది. ఇరాన్ కొనేవాటిల్లో గోధుమ, సోయాబీన్​, ఇతర కన్స్యూమర్​ ఉత్పత్తులు ఉంటాయి. ఇది రెండు దేశాలకు మధ్య కొన్నేళ్లపాటు సాగింది.

పోయినేడాది మరోసారి అమెరికా ఆంక్షల జోలికి వెళ్లింది. అయితే, ఆరు నెలలపాటు వెసులుబాటు కల్పించడంతో ఇరాన్​ నుంచి ఆయిల్​ అందింది. అయితే, ట్రేడ్​ నిబంధనల ప్రకారం  కాస్ట్​, ఇన్స్యూరెన్స్​ అండ్​ ఫ్రీట్​ (సీఐఎఫ్​) పద్ధతిలో ఇండియాకి ఆయిల్​ సప్లయి చేయాల్సి వచ్చింది. సీఐఎఫ్​ పద్ధతిలో కొనుగోలుదారుకి సరుకును భద్రంగా అప్పగించే వరకు అమ్మినవాళ్లదే పూర్తి బాధ్యత. మధ్యలో డ్యామేజీ జరిగినా, సరుకు గల్లంతయినా, లేక ఓడ మునిగిపోయినా కొన్నవాళ్లకు సంబంధం ఉండదు.

పేమెంట్లకోసం ఇరాన్​ తమ పసర్గాడ్​ బ్యాంక్​ బ్రాంచీని ముంబైలో ప్రారంభించాలనుకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటు పీరియడ్​లోగా ఇరాన్​ నుంచి కొనుగోళ్లు ఆపేసి ‘జీరో ట్రేడ్’ సాధించాలి. ఈ వెసులుబాటు ఇరాన్​తో దందా సాగించే ఇండియా, చైనా, గ్రీస్​, ఇటలీ, తైవాన్, జపాన్, టర్కీ, సౌత్​ కొరియాలకు అమెరికా ఇచ్చింది. అయితే, ఎప్పటికప్పుడు పొడిగించడంవల్ల ఇండియా సహా ఎనిమిది దేశాలూ ఇరాన్​ నుంచి ఆయిల్​ని కొంటూనే ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏమవుతుందోనని ట్రేడ్ వర్గాలు ఆందోళనగా ఉన్నాయి.