ఇండియా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ: సింధు క్వార్టర్స్‌‌‌‌తోనే సరి

న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌, స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు.. ఇండియా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీలో క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌లో అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ సింధు 9–21, 21–19, 17–21తో పారిస్‌‌‌‌ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, నాలుగోసీడ్‌‌‌‌ గ్రెగోరియా మారిస్కా తుంజంగ్ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నది. 62 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో సింధు ర్యాలీలు ఆడటంలో ఫెయిలైంది.

అదే టైమ్‌‌‌‌లో తుంజంగ్ కొట్టిన లాంగ్‌‌‌‌ ర్యాలీస్‌‌‌‌ను తీయడంలోనూ ఇబ్బందిపడింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో కిరణ్‌‌‌‌ జార్జ్‌‌‌‌ 13–21, 19–21తో వెంగ్‌‌‌‌ హంగ్ యాంగ్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి ఇంటిదారిపట్టాడు. అయితే, మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 21–10, 21–17తో జిన్‌‌‌‌ యంగ్‌‌‌‌–కాంగ్‌‌‌‌ మిన్‌‌‌‌ యుక్‌‌‌‌ (కొరియా)పై గెలిచి సెమీఫైనల్ చేరారు.