మీరు Apple iPhone 15 కొనుగోలు చేశారు. అయితే ఓ సారి మీ ఫోన్ యూఎస్ బీ ఫోర్ట్ లోపల పరిశీలించి చూడండి ఏం రాసిందో.. ఎందుకంటే ఇప్పుడు ఈ యూఎస్బీ ఫోర్టులో ఏముందనే దానిపైనే చర్చ.. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ గా మారింది. దీనివెనక పెద్ద కథే ఉందంట.. అదేంటో చూద్దాం.
Apple 2015లో iPhone 6S ప్రారంభం నుంచి చాలా కాలంగా భారతదేశంలో iPhoneలను అసెంబ్లింగ్ చేస్తోంది. కానీ ఈ సంవత్సరం వచ్చిన iPhone 15 సిరీస్ ప్రత్యేకమైనది. Apple విక్రయం ప్రారంభమైన మొదటి రోజు నుంచి భారతదేశంలో కేవలం “Assembled in India” iPhone 15 , iPhone 15 Plus మోడల్‌లను మాత్రమే విక్రయిస్తోంది.
ALSO READ: వాట్సాప్ ఛానెల్‌లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్న బాలీవుడ్ నటి
సాధారణంగా “Assembled in China” iPhoneలు మొదట్లో భారతదేశంలో విక్రయించారు. కొన్ని నెలల తర్వాత మాత్రమే "అసెంబుల్డ్ ఇన్ ఇండియా" మోడల్‌లు మార్కెట్‌లో వచ్చాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన iPhone 15 , iPhone 15 Plus లు USB టైప్-సి పోర్ట్‌తో వస్తున్నాయి. USB పోర్ట్ లోపల సోర్స్ కంట్రీ గురించి రాసి ఉంటుంది. అయితే iPhone 15మోడళ్లలో తయారు చేసింది ఇండియా లేదా చైనా.. USB పోర్ట్ లోపల ఏం రాసిందనే దానిపైనే ఇప్పుడు చర్చ.
ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను మాత్రమే అసెంబ్లింగ్ చేస్తోంది. iPhone 15 Pro, iPhone 15 Pro Max కాదు. ఐఫోన్ 15 ప్రో రెండు మోడల్‌లు ఇప్పటికీ చైనాలో అసెంబుల్ చేయబడుతున్నాయి. కాబట్టి సింపుల్.. మీరు iPhone 15 లేదా iPhone 15 Plusని కొనుగోలు చేస్తే, USB Type-C పోర్ట్ ఓపెనింగ్ లోపల “ఇండియా” అని చెక్కబడి ఉంటుంది , iPhone 15 Pro , iPhone 15 Pro Maxని కొనుగోలు చేస్తే “చైనా” అని రాసి ఉంటుంది.