శ్రీలంకతో నేటి నుంచి జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండియా మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు ఎంతో కీలకం కానుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వందో మ్యాచ్‌కాగా.. టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్‌కు తొలి పోరు. బలహీనంగా ఉన్న లంకను ఓడించి ఈ మ్యాచ్‌ను మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని ఈ ఇద్దరితో పాటు ఇండియా మొత్తం ఆశిస్తోంది. టీ20ల్లో వైట్‌వాష్ అయిన లంక నుంచి పెద్దగా పోరాటాన్ని ఆశించలేం. రోహిత్‌సేన జోరు చూపిస్తే మ్యాచ్ ఐదు రోజుల వరకూ కూడా వెళ్లకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఫోకస్ మొత్తం కోహ్లీ, రోహిత్‌పైనే ఉంది. కాగా.. విరాట్ వందో మ్యాచ్ కు ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా స్టేడియం నుంచి వీక్షించనుంది.
What a moment to commemorate his 100th Test appearance in whites ??
— BCCI (@BCCI) March 4, 2022
Words of appreciation from the Head Coach Rahul Dravid and words of gratitude from @imVkohli??#VK100 | #INDvSL | @Paytm pic.twitter.com/zfX0ZIirdz
రోహిత్ (కెప్టెన్), మయాంక్, హనుమ విహారీ, కోహ్లీ, పంత్ (కీపర్), శ్రేయస్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, జయంత్ లతో టీం గ్రౌండులోకి దిగింది.