దుబాయ్: చిరకాల ప్రత్యర్థులైన ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో మరోసారి నిరూపితమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 23న దుబాయ్‌లో జరిగే ఇండియా–పాక్ టికెట్లన్నీగంటలోనే అమ్ముడయ్యాయి.
పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో ఇండియా తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లను సోమవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. అభిమానులు పోటీ పడటంతో ఇండో–పాక్ టికెట్లు నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. 2 వేల దిర్హమ్ (రూ. 47 వేలు), 5 వేల దిర్హమ్ (రూ. 1.20 లక్షలు) టికెట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.