భారత్.. పాక్ యుద్ధం తర్వాత ఏంటి..?: ఈ దశలూ ఆలోచించాలంటున్న సోషల్ ఎనలిస్టులు..!

భారత్.. పాక్ యుద్ధం తర్వాత ఏంటి..?: ఈ దశలూ ఆలోచించాలంటున్న సోషల్ ఎనలిస్టులు..!

కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌‌‌తో ఇండస్ రివర్ వాటర్స్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంలో అద్భుతంగా వ్యవహరించింది. 1960 నుంచి మనం పాకిస్తాన్‌‌‌‌తో యుద్ధాలు చేసినప్పటికీ, భారతదేశం ఇండస్ రివర్ వాటర్స్‌‌‌‌ ట్రీట్ను ఎప్పుడూ టచ్​ చేయలేదు. దీంతో  పాకిస్తాన్ ఓవర్​ కాన్ఫిడెంట్​తో వ్యవహరించింది. భారతదేశం చివరకు పాకిస్తాన్‌‌‌‌పై ‘బ్రహ్మాస్త్రం’ ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయం  పాకిస్తాన్‌‌‌‌కు పెద్ద షాక్​ను ఇచ్చింది. భారతదేశం పాకిస్తాన్​తో  క్రికెట్ కూడా ఆడకూడదు.

ఇండియా అండ్  చైనా విషయానికి వస్తే..  చైనా పాకిస్తాన్‌‌‌‌కు ఆర్థిక సహాయం చేస్తుందని భారత్​కు పూర్తిగా తెలుసు. చైనా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మారడంతో కాస్త బలహీన స్థితిలో ఉంది. ఈనేపథ్యంలో చైనా  భారతదేశానికి సంయమన సందేశాలను పంపుతోంది. చైనా  పాకిస్తాన్‌‌‌‌ను   ప్రేరేపించడాన్ని తగ్గించాలని భారత్​ పట్టుబట్టవచ్చు. ఈక్రమంలో చైనా భారతదేశంతో యుద్ధాన్ని నివారించడానికి పాకిస్తాన్‌‌‌‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది.

దౌత్య యుద్ధమే ఉత్తమం
ఏ దేశానికైనా యుద్ధం ఎప్పుడూ చివరి ఎంపికగా ఉండాలి. భారతదేశం ఇప్పుడు ఇండస్ రివర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, యుద్ధ బెదిరింపు ద్వారా పాకిస్తాన్‌‌‌‌పై  భారీ ఒత్తిడి పెట్టింది. అదొక విజయమే.  ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్​ డిమాండ్ చేయవచ్చు. ఈ విషయంలో పాకిస్తాన్  కన్సెషన్స్​  ఇవ్వవలసి ఉంటుంది.  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని భారతదేశం డిమాండ్ చేయవచ్చు. భారతదేశం ఇంకా అనేక డిమాండ్లను లేవనెత్తవచ్చు. అయితే, ఈసారి సర్జికల్ స్ట్రైక్‌‌‌‌లు పనిచేయవు.  వ్యూహాత్మకంగా  భారతదేశం ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని అన్వేషించాలి.  దౌత్య యుద్ధం గెలవడానికి ఉత్తమ మార్గం అని చరిత్ర మనకు నిరూపించింది. దౌత్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దు.

డా. పెంటపాటి పుల్లారావు, సోషల్ ఎనలిస్ట్