భారత ఆటగాళ్లు ఆరెంజ్ డ్రెస్ లో అదిరిపోతున్నారు. అదేంటి టీమిండియా జెర్సీ బ్లూ కలర్ కదా అనుకుంటున్నారా..? నిజమే టీమిండియా అంతర్జాతీయ మ్యాచుల కోసం బ్లూ కలర్ జెర్సీ వేసుకున్నా ప్రాక్టీస్ లో మాత్రం ఆరెంజ్ జెర్సీలో కొత్తగా కనిపిస్తుంది. ప్రతీ ఐసీసీ టోర్నీలో కొత్త జెర్సీలో భారత ఆటగాళ్లు కనిపిస్తారు.
ఈ సారి కిట్ స్పాన్సర్ కూడా మారడంతో సరికొత్త మన ప్లేయర్స్ ఇలా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. కాగా.. గతంలో ప్రాక్టీస్ కి లేత ముదురు నీలి రంగులో ఉన్న జెర్సీలను వాడేవారు. టీమిండియా ఇలా ఆరెంజ్ కలర్ జెర్సీలో కనబడడం ఇదే తొలి సారి. దీంతో ఇప్పుడు ఈ నెటిజన్స్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ... చూడడానికి స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు ఈ విషయంపై స్విగ్గీ ఇండియా కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆరెంజ్ జెర్సీ బాయ్స్ వరల్డ్ కప్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. కాగా.. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచుని అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది.