బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ తర్వాత టీమిండియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.నవంబర్ 30, డిసెంబర్ 1న జరగబోయే ఈ మ్యాచ్ కు కాన్ బెర్రాలోని మనుకా ఓవల్ ఆతిధ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే కాన్ బెర్రా చేరుకున్నారు. ఆసీస్ కుర్రాళ్లతో మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను కలిసే అవకాశం లభించింది.
ఈ మీటింగ్ లో ఆస్ట్రేలియా ప్రధాని భారత స్టార్ క్రికెటర్లతో సరదాగా ముచ్చటించారు. కోహ్లీతో మాట్లాడుతూ పెర్త్ టెస్ట్ లో సాధించిన సెంచరీని ప్రశంసించాడు. ఎప్పుడూ దూకుడుగా ఉండాలని కోహ్లీతో ఆయన అన్నారు. మరోవైపు తొలి టెస్టులో సంచలన బౌలింగ్ తో 8 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న బుమ్రాను "నువ్వొక స్టార్" అని ఆసీస్ ప్రధాని అన్నారు. భారత క్రికెటర్లతో సెల్ఫీ తీసుకొని కాసేపు మాట్లాడాడు.
ALSO READ | ఆస్ట్రేలియా నడ్డి విరిచిన టీమిండియా పేసర్లు.. బుమ్రా 1 జైస్వాల్ 2
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహిస్తాడు. అడిలైడ్ లో డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్ టెస్ట్ ప్రారంభమవుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో సైతం పింక్-బాల్ ను ఉపయోగించనున్నారు. భారత్ కు ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచింది.
AUSTRALIAN PRIME MINISTER HAVING A CHAT WITH ROHIT, KOHLI & BUMRAH. 🇮🇳🇦🇺pic.twitter.com/SB1sgUnWFO
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2024