న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమ్‌లో మెజారిటీ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి ఈ నెల 25న న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత మిగతా ప్లేయర్లు యూఎస్ఏ చేరుకోనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలోని వరల్డ్ కప్ ఆటగాళ్లు ఆదివారమే మెగా టోర్నీ కోసం న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాల్సింది.
కానీ, టీమిండియా జూన్1న బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. మొదటి బ్యాచ్ వచ్చే శనివారం ప్రయాణం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, బుమ్రా, పంత్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ న్యూయార్క్ బయల్దేరుతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ ఫైనల్ ఆడే క్రికెటర్లు ఈ పోరు ముగిసిన తర్వాతి రోజే ఫ్లైట్ ఎక్కనున్నారు. కాగా, జూన్ 2న మొదలయ్యే వరల్డ్ కప్‌లో ఇండియా జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.