భారత్, ఇంగ్లాండ్ మధ్య శనివారం (జనవరి 25) రెండో టీ20 జరగనుంది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. తొలి టీ20లో గెలిచి టీమిండియా ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంటే.. ఇంగ్లాండ్ ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ లో ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచి తీరాల్సిందే. మరోవైపు ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని చూస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండో టీ20 కోసం భారత్ రెండు మార్పలతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఓపెనర్ అభిషేక్ శర్మకు శుక్రవారం ప్రాక్టీస్ చేస్తుండగా చీలమండకు గాయమైంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ కు ఈ యువ ఓపెనర్ దూరం కానున్నాడు. తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ చేసి భారత్ కు విజయాన్ని అందించిన ఈ పంజాబీ ఓపెనర్ స్థానంలో ధృవ్ జురెల్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు చెన్నై లో మ్యాచ్ జరుగుతుండడంతో లోకల్ కుర్రాడు వాషింగ్ టన్ సుందర్ జట్టులో చేరే అవకాశం ఉంది.
సుందర్ జట్టులో చేరితే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. అదే జరిగితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై స్పష్టత కొనసాగుతోంది. 14 నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏండ్ల షమీ తొలి పోరులోనే బరిలోకి దిగుతారని అభిమానులు ఆశించారు. కానీ, అతని సంసిద్ధతను టీమ్ మేనేజ్‌మెంట్ లోతుగా పరిశీలించాలనుకోవడంతో రీఎంట్రీ వాయిదా పడింది. రెండో టీ20కి షమీ ఆడే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. ఈ రెండు మార్పులు మినహాయిస్తే భారత జట్టు తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది.
Injury concerns in India camp as Abhishek Sharma twisted his ankle while training ahead of the second #INDvENG T20I. pic.twitter.com/V8bmanynic
— Cricbuzz (@cricbuzz) January 24, 2025