IND vs ZIM 2024: ప్రయోగాలు మొదలెట్టిన గిల్.. నలుగురు బౌలర్లతోనే టీమిండియా

IND vs ZIM 2024: ప్రయోగాలు మొదలెట్టిన గిల్.. నలుగురు బౌలర్లతోనే టీమిండియా

హరారే వేదికగా టీమిండియా జింబాబ్వేతో రెండో టీ20 ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతవరకు ఊహించేందే అయినా తుది జట్టులో కెప్టె శుభమాన్ గిల్ ప్రయోగాత్మక మార్పు చేశాడు. ప్లేయింగ్ 11 నుంచి ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ను తప్పించాడు. తొలి టీ20 లో భారత జట్టు అనూహ్యంగా ఓడిపోగా ఆ మ్యాచ్ లో ఖలీల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే అతని స్థానంలో ఆశ్చర్యకరంగా బ్యాటర్ సాయి సుదర్శన్ ను ప్లేయింగ్ 11 లో తీసుకొచ్చాడు. 

సాయి సుదర్శన్ కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. నిలకడకు మారు పేరైనా ఈ తమిళ నాడు ప్లేయర్ ను జట్టులోకి తీసుకురావడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. కానీ బౌలర్లు మాత్రం నలుగురే ఉన్నారు. సుందర్, బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ స్పెషలిస్ట్ బౌలర్లుగా ఉన్నారు. దీంతో ఐదో బౌలర్ గా అభిషేక్ శర్మ ఖచ్చితంగా 4 ఓవర్ల కొత్త వేయాల్సిన పరిస్థితి. పార్ట్ టైం బౌలర్ గా పరాగ్ ఉన్నా అతన్ని నమ్మలేం. పైగా అతనికి ఇది తొలి సిరీస్. 

గిల్ చేసిన ప్రయోగం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. టార్గెట్ జింబాబ్వే ఛేజ్ చేసేటప్పుడు అభిషేక్ శర్మ నాలుగు ఓవర్లు వారికి కొంత అనూకూలంగా మారవచ్చు. భారత్ లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా భారీ స్కోర్ చేయాల్సిందే. మొదట బ్యాటింగ్ చేసి 140,150 స్కోర్ చేసినా మ్యాచ్ కాపాడుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. మరి గిల్ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.