IND vs NZ 3rd Test: బుమ్రా లేకుండా భారత్ బరిలోకి.. అసలు కారణం ఇదే

IND vs NZ 3rd Test: బుమ్రా లేకుండా భారత్ బరిలోకి.. అసలు కారణం ఇదే

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వరుసగా రెండోసారి భారత్ ఈ సిరీస్ లో టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సాంట్నర్ ప్లేస్ లో ఇష్ సోధీకి అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్ సౌథీ స్థానంలో హెన్రీ వచ్చాడు. మరోవైపు భారత్ బుమ్రాకు షాక్ ఇచ్చింది. అతను స్థానంలో సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో బుమ్రా లేకుండానే మూడో టెస్ట్ ఆడుతుంది. 

Also Read : రోహిత్ ఎంత గొప్ప మనసు

ప్రస్తుతం భారత్ సిరీస్ లో వెనకబడి ఉంది. సిరీస్ ను 0-2 తేడాతో కోల్పోయింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు మరో 6 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో న్యూజిలాండ్ తో చివరి టెస్టుతో పాటు ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే వీటిలో నాలుగు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. ఆస్ట్రేలియాతో సిరీస్ కష్టం కాబట్టి ముందుగా కివీస్ తో జారగబోయే చివరి టెస్ట్ గెలిచి తీరాలి. ఈ సమయంలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు సీనియర్ పేసర్ షమీ దూరమయ్యాడు. దీంతో భారత్ కు బుమ్రా ఒక్కడే భారత్ పేస్ దళాన్ని మోయనున్నాడు. ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ కు ముందు బుమ్రాను తాజాగా ఉంచాలనే జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుండడంతో భారత్ ఈ మ్యాచ్ లో బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది.