IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే

IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్ తో స్వదేశంలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా టీమిండియా బరిలోకి దిగుతుంది. తొలి టీ20 బుధవారం (జనవరి 22) ప్రారంభం కానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. భారత కాలమాన ప్రకారం మూడు టీ20 మ్యాచ్ లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలి టీ20 మ్యాచ్ కు భారత తుది జట్టు విషయంలో ఆసక్తి నెలకొంది. టీమిండియా ఆడబోయే ప్లేయింగ్ 11 ఆడే జట్టుపై ఒక క్లారిటీ వచ్చింది.  

డిసెంబర్ లో సౌతాఫ్రికా సిరీస్ తో అదరగొట్టిన భారత జట్టు ఇంగ్లాండ్ తో బరిలోకి దిగబోతుంది. నితీష్ కుమార్ రెడ్డి, షమీ అందుబాటులో ఉండడంతో తుది జట్టులో చేరనున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగనున్నారు. మూడు నాలుగు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ ఆడతారు. ఆల్ రౌండర్లు గా హార్దిక్ పాండ్య, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ జట్టులో ఉండడం ఖాయం. ఫినిషర్ గా రింకూ సింగ్ కొనసాగనున్నాడు. 

ALSO READ : IND vs ENG: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ కాదు.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్ మెకల్లమ్

ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్న వరుణ్ చక్రవర్తి లేదా బిష్ణోయ్ లలో ఒకరికి చోటు దక్కనుంది. సౌతాఫ్రికా సిరీస్ లో అద్భుతంగా రాణించిన వరుణ్ కే ప్లేయింగ్ 11 లో చోటు దక్కొచ్చు. ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమీతో పాటు అర్షదీప్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. పటిష్టమైన ఇంగ్లాండ్ ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. సుందర్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణాలు బెంచ్ కే పరిమితం కానున్నారు.