భారత్ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్ అత్యున్నత పౌరపురస్కారం అందుకున్నారు. భూటాన్, భారత్ ల మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ మోదీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పోని అందజేశారు. ఈ అవార్డ్ పొందిన తొలి విదేశీ ప్రభుత్వాధిపతిగా ఆయన నిలిచారు. భారత్, -భూటాన్ సంబంధాల పెరుగుదలకు, భూటాన్, అక్కడి ప్రజలకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వబడింది.
ఇండియా ప్రధాని భూటాన్ దేశానికి కృతజ్ఙతలు తెలిపి, ఆ అవార్డ్ ను 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. భారత్ ప్రధాని ఈరోజు భూటన్ దేశ పర్యటనలో ఉన్నారు. 2014 నుంచి ప్రధాని హోదాలో ఇది ఆయన మూడో పర్యటన. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద భూటాన్‌తో ఇండియా దీర్ఘకాల సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం.