8 నెలల గరిష్టానికి ఇండియా పీఎంఐ​

8 నెలల గరిష్టానికి ఇండియా పీఎంఐ​

న్యూఢిల్లీ: మనదేశ మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్ ఉత్పాదకత కిందటి నెలలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫ్యాక్టరీ ఆర్డర్లు, ప్రొడక్షన్​, డిమాండ్​ పెరగడమే ఇందుకు కారణమని హెచ్​ఎస్​బీసీ ఇండియా తెలిపింది. ఎగుమతులూ పెరిగాయని పేర్కొంది. 

మాన్యుఫాక్చరింగ్​పర్చేజింగ్​మేనేజింగ్​ఇండెక్స్​(పీఎంఐ) మార్చిలో 58.1 శాతం ఉంది.  ఫిబ్రవరిలో ఇది 14 నెలల కనిష్టస్థాయి 56.3కి పడిపోయింది. పీఎంఐ 50 కంటే ఎక్కువగా ఉంటే విస్తరిస్తున్నట్టుగా భావిస్తారు.