2047 నాటికి ఇండియా రిచ్​.. జీడీపీ 25–35 ట్రిలియన్ డాలర్లకు.. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం

2047 నాటికి ఇండియా రిచ్​.. జీడీపీ 25–35 ట్రిలియన్ డాలర్లకు.. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం
  • జీడీపీ 25–35 ట్రిలియన్ డాలర్లకు.. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం
  • లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సప్లయ్ చెయిన్ మెరుగుపరుచుకోవాలి: బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా ఎదుగుతుందని, జీడీపీ 25–35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. సర్వీసెస్ సెక్టార్ సాయంతో ఇండియా ఆర్థిక వ్యవస్థ మరింతగా వృద్ధి చెందుతుందని తెలిపింది. ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం, 2047 నాటికి ఇండియా జీడీపీలో సర్వీసెస్ సెక్టార్ వాటా 60 శాతానికి పెరుగుతుంది.

మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వాటా 32 శాతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను నడపడంలో ఈ రెండూ కీలకంగా మారతాయి. రానున్న  20 ఏళ్లలో 20 కోట్ల మంది వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ (పనిచేయగలిగేవారు) అందుబాటులోకి వస్తారని అంచనా. పెద్ద మొత్తంలో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్రియేట్ చేయగలిగే అవకాశం ఇండియాకు ఉంది. వివిధ సెక్టార్లలో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం కీలకం.

ఏఐ సాయంతో చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజైన్, కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారీ ఖర్చును తగ్గించుకోవచ్చు. మరోవైపు ఇండియా రెన్యూవబుల్ కరెంట్ ఉత్పత్తి వేగంగా పెరుగుతోంది.

మొత్తం కరెంట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెన్యూవబుల్ ఎనర్జీ వాటా  2047 నాటికి  70 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ నెంబర్ 27 శాతంగా ఉంది. అలానే  వెహికల్ పార్టుల ఎగుమతులు కూడా 2047 నాటికి 200–250 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్  బండ్లు ఎక్కువగా ఉండడంతో పాటు,  ఈవీలకు షిప్ట్ అవుతుండడంతో వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపోనెంట్ల తయారీ పెరుగుతోంది. 

ఈ సెక్టార్లు కీలకం..
ఇండియా అధిక ఆదాయ దేశంగా మారడంలో ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆటోమోటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్ల పాత్ర కీలకం. ఇండియాలోని పరిస్థితులను వాడుకుంటే ఈ సెక్టార్లలో వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్ అంచనా వేస్తోంది.

ప్రజల ఆదాయాలు పెంచడం, స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడం, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడంతో  ఆర్థిక వృద్ధి  సాధ్యమతుందని వివరించింది. అలానే సమస్యలు లేకపోలేదని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో 2030 నాటికి 5 కోట్ల మంది వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కొరత నెలకొంటుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలానే  స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పెద్ద మొత్తంలో అమలు చేయాలి. సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డెవలప్ చేసుకోవాలి.  కీలకమైన కాంపోనెంట్ల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి.  ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇతర కీలకమైన సెక్టార్లలో రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​పై (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ) పెట్టుబడులు పెంచాలి. ఫలితంగా కొత్త ఇన్నోవేషన్లు అందుబాటులోకి వస్తాయి.  గ్లోబల్ సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడడం తగ్గుతుంది.

‘ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడం, యువత స్కిల్స్ పెంచడం, టెక్నాలజీ సాయంతో కొత్త ఇన్నోవేషన్లను డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా   ఇండియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తయారీ పెంచడం, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీపై ఫోకస్ పెట్టడంతో ఫ్యూచర్ టెక్నాలజీ, గ్లోబల్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా ఎదగగలుగుతుంది’ అని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా అన్నారు.