పోస్ట్ ఆఫీసుల్లో 21వేల 413 ఉద్యోగాలు.. పదో తరగతి పాసయ్యుంటే చాలు, రాతపరీక్ష లేదు

పోస్ట్ ఆఫీసుల్లో 21వేల 413 ఉద్యోగాలు.. పదో తరగతి పాసయ్యుంటే చాలు, రాతపరీక్ష లేదు

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21వేల 413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో 519, ఏపీ పరిధిలో 1215 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు టెన్త్ అర్హత. పదో తరగతిలో వచ్చిన మార్కులతో ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు. అర్హత, ఆసక్తి గల వారు మార్చి 3లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

మొత్తం ఖాళీలు: 21,413

  • తెలంగాణ: 519
  • ఆంధ్ర ప్రదేశ్: 1215

విద్యార్హతలు: మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులుగా ఉండి ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాసైన వారు అర్హులు. స్థానిక భాషపై పట్టుండాలి. అనగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం వచ్చి ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

వయో పరిమితి: 2025, మార్చి 03 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు.. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయో సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ OBCఅభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ స్త్రీలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 

Also Read : కరప్షన్ పర్సెప్షన్స్​ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో భారత్కు 96వ స్థానం

అభ్యర్థులు ఏదేని ఒక పోస్టల్‌ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్‌ సర్కిళ్లకు దరఖాస్తు చేస్తే.. అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల ప్రారంభ తేది: ఫిబ్రవరి 10, 2025
  • దరఖాస్తులకు చివరితేది: మార్చి 3, 2025

ఎంపిక విధానం:

  • మెరిట్ బేస్డ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నియామకం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు. పదో తరగతి పాసై ఊర్లలో ఖాళీగా ఉన్న వారికి ఇదొక మంచి అవకాశం. దరఖాస్తు చేసుకోండి. 
 
జీడీఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రోజంతా పని చేయక్కర్లేదు. 4 గంటలు పని చేస్తే చాలు. దాంతో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం ఉంటుంది.

  • నోటిఫికేషన్ కోసం ఇక్కడ India Post GDS Recruitment 2025 క్లిక్ చేయండి. 

  • తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఇక్కడ Telangana క్లిక్ చేయండి.