T20 World Cup 2024: ఐర్లాండ్‌తో‌ మ్యాచ్.. శాంసన్, జైశ్వాల్‌కు నో ఛాన్స్

T20 World Cup 2024: ఐర్లాండ్‌తో‌ మ్యాచ్.. శాంసన్, జైశ్వాల్‌కు నో ఛాన్స్

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా నేడు (జూన్ 5) తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న భారత్.. పసికూన  ఐర్లాండ్ తో తలపడబోతుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తుంటే.. మరోవైపు సంచలనాలకు మారు పేరైన ఐర్లాండ్ భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టు ఒకసారి పరిశీలిద్దాం. 

ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపుగా ఖాయమైంది. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లో భాగంగా కోహ్లీ రెస్ట్ తీసుకోగా.. ఆశ్చర్యకరంగా జైస్వాల్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. జైస్వాల్ మినహాయిస్తే ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేశారు. దీంతో వరల్డ్ కప్ లో జైశ్వాల్ ను పక్కన పెడుతున్నట్టుగా అర్ధమవుతుంది. మూడో స్థానంలో సూర్య కుమార్ యాదవ్ స్థానానికి ఎలాంటి ఢోఖా లేదు. 

వికెట్ కీపర్ విషయంలో సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో సంజు విఫలం కాగా.. పంత్ అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో నాలుగో స్థానంలో పంత్ బ్యాటింగ్ కు రానున్నాడు. ఆల్ రౌండర్లు దూబే, హార్దిక్ పాండ్య, జడేజా వరుసగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు స్పిన్నర్లు కావాలనుకుంటే అక్షర్ పటేల్ 8 వ స్థానంలో.. కుల్దీప్, బుమ్రా, సిరాజ్ వరుసగా 9,10,11 స్థానాల్లో జట్టులో ఉంటారు.

భారత తుది జట్టు అంచనా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ , రిషబ్ పంత్ (wk), , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.