IND vs ENG: సుందర్, జురెల్ ఔట్.. మూడో టీ20కి టీమిండియాలో పవర్ హిట్టర్లు

IND vs ENG: సుందర్, జురెల్ ఔట్.. మూడో టీ20కి టీమిండియాలో పవర్ హిట్టర్లు

ఇంగ్లాండ్ తో నేడు (జనవరి 28) జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమమవుతుంది. ఐదు టీ20ల సిరీస్‌‌‌‌లో భాగంగా మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌‌‌‌లో గెలిచి రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లోనే సిరీస్‌‌‌‌ నెగ్గాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి రెండు టీ20ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న సూర్య సేన నేటి మ్యాచ్ లోనూ గెలిచి చివరి రెండు టీ20ల్లో బెంచ్ కు అవకాశం ఇవ్వాలని ఇవ్వాలని చూస్తుంది. ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ను ప్రకటించగా.. భారత్ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్ లో భారత రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో విఫలమైన ధృవ్ జురెల్ స్థానంలో శివమ్ దూబే రానున్నాడు. రాజ్ కోట్ లో సుందర్ ను పక్కన పెట్టి రమణ్ దీప్ సింగ్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకురావాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ లోయర్ ఆర్డర్ లో ఉంటే టీమిండియాకు తిరుగుండదు. చెన్నై టీ20లో సుందర్ ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. ఈ రెండు మార్పులు మినహాయిస్తే రెండో టీ20కి బరిలోకి దిగిన జట్టుతోనే భారత్ ఆడబోతుంది. 

మరోవైపు బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు తొలి రెండు టీ20ల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. సొంతగడ్డపై భారత్ విజృంభించడంతో తొలి రెండు టీ20ల్లో ఇంగ్లాండ్ కు పరాజయాలే ఎదురయ్యాయి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు టీ 20 మ్యాచ్ లు ఓడిపోయి 0-2 తో వెనకబడిన ఇంగ్లాండ్ కు నేడు జరగనున్న మ్యాచ్ చావో రేవో లాంటింది.ఈ మ్యాచ్ లోనూ ఓడిపోతే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోతుంది. దీంతో రాజ్ కోట్ టీ20లో మ్యాచ్ ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. 

టీమిండియాతో మూడో టీ20కు ఇంగ్లాండ్ జట్టు:

బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

భారత్ జట్టు అంచనా:

సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, రమణ్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/మహమ్మద్ షమీ/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి