బిల్లీ జీన్‌‌ కింగ్ కప్‌‌ ప్లే ఆఫ్స్‌‌కు ఇండియా

బిల్లీ జీన్‌‌ కింగ్ కప్‌‌ ప్లే ఆఫ్స్‌‌కు ఇండియా

పుణె: బిల్లీ జీన్‌‌ కింగ్‌‌లో ఇండియా టెన్నిస్‌‌ టీమ్‌‌ రెండోసారి ప్లే ఆఫ్స్‌‌కు క్వాలిఫై అయ్యింది. ఆసియా ఓసియానియా గ్రూప్‌‌–1లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా 2–1తో కొరియాపై నెగ్గింది. తొలి మ్యాచ్‌‌లో తెలుగమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 5–7, 6–3, 7–6 (7/5)తో సోయున్‌‌ పార్క్‌‌పై నెగ్గింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన మ్యాచ్‌‌లో రష్మిక బలమైన సర్వీస్‌‌లు, గ్రౌండ్‌‌ స్ట్రోక్స్‌‌తో చెలరేగింది.

రెండో సింగిల్స్‌‌లో తెలుగు ప్లేయర్‌‌ యమలపల్లి సహజ 3–6, 4–6తో డియోన్‌‌ బాక్‌‌ చేతిలో ఓడింది. గంటా 45 నిమిషాల మ్యాచ్‌‌లో సహజ స్థాయి మేరకు రాణించలేకపోయింది. దీంతో ఇరుజట్ల స్కోరు 1–1తో సమమైంది. నిర్ణయాత్మక డబుల్స్‌‌ మ్యాచ్‌‌లో అంకితా రైనా–ప్రార్ధన తోంబరే 6–4, 6–3తో సోయున్‌‌ పార్క్‌‌–డాబిన్‌‌ కిమ్‌‌ను ఓడించి ఇండియాను గెలిపించారు. గంటా 15 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ద్వయం కీలక టైమ్‌‌లో బ్రేక్‌‌ పాయింట్లు కాపాడుకున్నారు. సర్వీస్‌‌ల్లోనూ అదరగొట్టారు. ఇండియా 2020లోనూ ప్లే ఆఫ్స్‌‌కు అర్హత సాధించింది