
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ(హెచ్డీఐ)– 2022లో మొత్తం 193 దేశాలకుగాను భారత్ 134వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 191 దేశాలకుగాను ఇండియా 135వ ర్యాంకులో ఉంది. లింగ అసమానత్వ సూచీలో(జీఐఐ)లో 2021లో 122వ స్థానానికి పరిమితమైన భారతదేశం 2022లో 14 ర్యాంకులు పైకెళ్లి 108వ స్థానంలో నిలిచింది.
- 2022లో భారత్ హెచ్ఐవీ విలువ 0.646కు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 0.633గా ఉండేది. 1990 నుంచి 2022 వరకు భారత హెచ్ఐవీ విలువ 48.4 శాతం పెరిగింది.
- సగటు ఆయుర్ధాయం, విద్య, తలసరి స్థూల జాతీయాదాయం (జీఎస్ఐ) తదితర అన్ని హెచ్ఏఐ సూచికల్లోనూ 2021తో పోలిస్తే 2022లో భారత్ మెరుగైంది.
- సగటు ఆయుర్ధాయం 67.2 ఏళ్ల నుంచి 67.7 ఏళ్లకు పెరిగింది.
- చదువుకునే సంవత్సరాల సగటు అంచనా 12.6 ఏళ్లకు చేరుకుంది.
- తలసరి జీఎస్ఐ 6542 డాలర్ల నుంచి 6951 డాలర్లకు పెరిగింది.
- లింగ అసమానతలను తగ్గించడంలో మన దేశం చెప్పుకోదగ్గ పురోగతి కనబరిచింది. 2022లో భారత్ జీఐఐ విలువ 0.437గా నమోదైంది. ఇది అంతర్జాతీయ (0.462), దక్షిణాసియా సగటు (0.478) విలువతో పోలిస్తే మెరుగైన విలువ. అయితే భారత్లో కార్మిక శక్తి భాగస్వామ్యం విషయంలో స్త్రీలు (28.3శాతం), పురుషులు (76.1శాతం) మధ్య అంతరం మాత్రం ఇప్పటికీ భారీగానే ఉంది.
- జీఐఐలో సంతానోత్పత్తి ఆరోగ్యం, సాధికారత, కార్మిక మార్కెట్ అనే మూడు అంశాల్లో లింగ సమానతలను గణిస్తారు.
- కొవిడ్ ప్రతికూలతల నుంచి చాలా దేశాలు బయటపడుతున్నప్పటికీ కొన్ని పేద దేశాల పరిస్థితి మాత్రం క్షీణిస్తూ వస్తోంది. గత రెండు దశాబ్దాల కాలంలో అభివృద్ధి విషయంలో ధినక, పేద దేశాల మధ్య అంతరం తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అసనమానతలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మానవాభివృద్ధి సూచీ
మానవాభివృద్ధిని కొలిచే సాధనమే మానవ అభివృద్ధి సూచిక. దీనిని ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెపలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) రూంపొందించి 1991 నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తోంది. దీనిని మహబూబ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో రూపొందించారు. తర్వాత దీనిని విస్తరించడంతోపాటు సవరిస్తూ వచ్చారు. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతోపాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి అని మహబూబ్ ఉల్ హక్ నిర్వచించారు. హక్ ప్రకారం మానవాభివృద్ధి నమూనాలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి..
1. సమానత్వం – ప్రజలందరూ సమాన అవకాశాలు పొందాలి.
2. సుస్థిరత – మనం పొందే సంక్షేమం తర్వాత తరం కూడా పొందాలి.
3. ఉత్పాదకత – మానవ మూలధనంలో పెట్టుబడి ద్వారా ఉత్పాదకత పెంచడం.
4. సాధికారత – ప్రజలు తమ ఎంపికలకు అనుగుణంగా పనిచేయడం.
- మానవాభివృద్దికి చెందిన ఇతర సూచీలను అభివృద్ధి చేశారు. అవి..
- 1995– లింగ సంబంధ అభివృద్ధి సూచీ
- 1995 – లింగ సాధికారిత కొలమానం
- 1997 – మానవ పేదరిక సూచీ - I
- 1998 – మానవ పేరిదక సూచీ– II
- మానవాభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకునే మూడు అంశాలు
- ఆయుర్ధాయం – దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం
- విజ్ఞానం – ఇందులో రెండు అంశాలు ఉంటాయి.
ఎ. వయోజన అక్షరాస్యత (2/3 వంతు భాగం)
బి. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ విద్యలో ఉమ్మడి నమోదు నిష్పత్తి (1/3 వంతు భాగం)
3. మెరుగైన జీవన ప్రమాణం దీనిని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా కొలుస్తారు. అమెరికన్ డాలర్లలో వ్యక్తం చేస్తారు.