తాజా సస్టెయినబుల్ ట్రేడ్ ఇండెక్స్(ఎస్టీఐ)లో 24 స్కోర్‌తో భారత్ 23వ స్థానంలో నిలిచింది. ఎస్టీఐ–2024ను హిన్రిచ్ ఫౌండేషన్, ఐఎండీలు సంయుక్తంగా రూపొందించాయి.
సూచీలో ముఖ్యాంశాలు
ఆర్థిక, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత తదితర మూడు అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 30 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వాణిజ్య విధానాల సుస్థిరతను అంచనా వేస్తుంది.
సూచీలో 1. న్యూజిలాండ్, 2. యునైటెడ్ కింగ్డమ్, 3. ఆస్ట్రేలియా, 4. సింగపూర్, 5. జపాన్ టాప్ పెర్ఫార్మర్స్‌గా నిలిచాయి.
భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించినా, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరతలో సవాళ్లను ఎదుర్కొంటుండటంతో 23వ స్థానంలో నిలిచింది.