ఏఐ రంగంలో ఇండియా దూసుకుపోతోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్ట్ లో తేలింది. ఏఐకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లో బోస్టన్ సంస్థ అధ్యయనం జరపగా ఏఐ స్పెషలిస్ట్స్ సెగ్మెంట్ లో ఇండియా సెకండ్ ప్లేస్ లో నిలిచిందని తెలిపింది. అంతే కాకుండా రీసర్చ్ పబ్లికేషన్స్ సెగ్మెంట్లో ఇండియా థర్డ్ ప్లేస్ లో నిలిచిందని రిపోర్ట్ లో తెలిపింది బోస్టన్ సంస్థ. ఇండియా ఏఐకి సంబంధించిన పేటెంట్స్ లో కూడా స్ట్రాంగ్ బేస్ కలిగి ఉందని ఈ రిపోర్ట్ లో పేర్కొంది బోస్టన్.
ఇదిలా ఉండగా.. బోస్టన్ సంస్థ అధ్యయనం జరిపిన 73 దేశాల్లో సుమారు 70 శాతం దేశాలు ఎకో సిస్టం పార్టిసిపేషన్, స్కిల్స్, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి కీలక అంశాల్లో అంశాల్లో బీలో యావరేజ్ గా నిలిచినట్లు తెలిపింది. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తూ ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది బోస్టన్.
ALSO READ : జై జై BSNL.. జియో, ఎయిర్ టెల్, ఐడియా నుంచి భారీ వలసలు.. అంత బాగున్నాయా ప్యాకేజీలు..!
రిటైల్, హోల్సేల్ రంగాల జీడీపీలో ఏఐకి 10శాతం ప్రాధాన్యత ఉందని.. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్ మేనేజ్మెంట్, వంటి సెగ్మెంట్స్ లో ఏఐని వినియోగించటం వల్ల వేస్టేజ్ ని నియంత్రించవచ్చని తెలిపింది. పబ్లిక్ సర్వీసెస్ జీడీపీలో ఏఐకి 6 శాతం ప్రాధాన్యత పెరిగిందని.. ఈ రంగంలో సర్వీస్ డెలివరీ,ఎం ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాల్లో ఏఐ కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపింది బోస్టన్.