అంతర్జాతీయం
సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం
అమెరికా (916 బిలియన్ డాలర్లు), చైనా (296 బిలియన్ డాలర్లు), రష్యా(109 బిలియన్ డాలర్లు) తర్వాత రక్షణ రంగానికి 83.6 బిలియన్ డాలర్లను కేటాయించడం ద్వారా భారత్ 2023లో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది.
కాలుష్య నగరంగా ఖాట్మండు
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిని కొలిచే ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-ర్యాంకింగ్’ ప్రకారం ప్రపంచంలోని అనారోగ్యకరమైన వాయు జాబితాలో ఖాట్మండు అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ, థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌మై, వియత్నాంలోని హనోయి, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ మరియు బంగ్లాదేశ్‌లోని ఢాకా వరుసగా రెండు, మూడు, నాలుగు మరియు ఐదవ స్థానాల్లో ఉన్నాయి.
జాతీయం
ఏఐ యాంకర్‌కు గ్లోబల్ మీడియా అవార్డ్
ఇండియా టుడే గ్రూప్ ఏఐ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకుంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ గ్లోబల్ మీడియా అవార్డ్స్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది.
భారత్ వృద్ది 7.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచింది. నివేదిక ప్రకారం 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది.
జీఎస్‌టీ రికార్డు వసూళ్లు
భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షాలో రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటివరకు రికార్డు.
విమానయాన ఉద్గారాల్లో మూడో స్థానం
2019 లో అంతర్జాతీయ విమానయాన డాటా ఆధారంగా నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో విమానయాన రంగం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, బ్రిటన్ రెండో స్థానంలో ఉన్నాయి.
ఎన్ఆర్ఐ ఓట్లలో కేరళ టాప్
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఎన్ఆర్ఐ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళ 74.9శాతంతో టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
నైమా ఖాతూన్
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్‌చాన్సలర్(వీసీ)గా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు.1875లో ఏర్పాటైన ముహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజీ...1920 లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.
ప్రబోవో సుబియాంతో
ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ఈ ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండోనేసియా రక్షణ మంత్రిగా ఉన్నారు.
స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్ ఎన్నికయ్యారు. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా గౌతమానంద్‌జీ బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు 95 ఏళ్ల గౌతమానంద్‌జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ వెళ్లనున్నారు. వారం రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు.