మనోళ్లు బాగానే దాచేస్తున్నారు.. పొదుపులో అమెరికాను దాటేశాం.. టార్గెట్ ఆ మూడు దేశాలే

 మనోళ్లు బాగానే దాచేస్తున్నారు.. పొదుపులో అమెరికాను దాటేశాం.. టార్గెట్ ఆ మూడు దేశాలే

మీరు వ్యవసాయం, ఉద్యోగం, బిజినెస్ లేదంటే ఏదైనా పని చేసేవారు అయితే.. మీ చేతిలో మిగులు డబ్బు ఉంటే ఏం చేస్తారు.. దాచుకుంటారు కదా. ఆ దాచుకునే అలవాటే ఇపుడు మన ఇండియాను ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. భారతీయులు సంప్రదాయంగా వస్తున్న పొదుపు చేసే అలవాటును కొనసాగిస్తున్నారంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (SBI ) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయులు బాగా పొదుపు చేస్తున్నారని తేలింది. 

ప్రపంచ పొదుపు శాతం 28.2 శాతాన్ని మించి ఇండియా 30.2 శాతం పొదుపు రేటుతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలించింది. ప్రపంచ దేశాలలో అత్యధికంగా పొదుపు చేస్తున్నవారు చైనా ప్రజలు. చైనా (46.6 శాతం పొదుపుతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక రెండు, మూడు స్థానాలలో ఇండోనేషియా (38.1%), రష్యా  (31.7%) ఉన్నాయి. 

2011తో పోల్చితే 50 శాతం పెరిగిన భారతీయుల పొదుపు:

ఎస్బీఐ Ecowrap series సిరీస్ లో భాగంగా ఈ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. భారతీయులలో పొదుపు సామర్థ్యం బాగా పెరిగింది.  80 శాతం ఇండియన్స్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటమే కాకుండా.. పొదుపు విషయంలో అనూహ్యంగా మార్పు వస్తోందట.  2011లో 50 శాతం అకౌంట్లు కలిగి ఉండగా ప్రస్తుతం 80 శాతం అకౌంట్లకు పెరిగటం అందుకు నిదర్శనం. అయితే బ్యాంకు అకౌంట్లు పెరిగితే పొదుపు సామర్థ్యం పెరిగినట్లు కాదు. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులకు ఎంత మేరకు పొదుపు చేస్తున్నారనే అంశంపై ఆధారపడి ఈ రిపోర్టు ఉంటుంది. 

ఎక్కడ.. ఎలా దాస్తున్నారు?

సంప్రదాయకంగా మన వాళ్ల పొదుపు క్యాష్ రూపంలో దాచుకోవడం, లేదా వెండి, బంగారం కొని దాచుకోవడం చేస్తుండేవారు. ఆ అలవాటు కాస్త బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం వరకు ఒక సగటు మనిషి చేస్తున్న పని.  అయితే ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత పెరగడం, ఫైనాన్స్ రంగంలో వస్తున్న  మార్పులకు అనుగుణంగా భారతీయుల పొదుపు విధానం మారుతూ వస్తోంది.

ALSO READ | శ్రేయాస్‌‌‌‌‌‌‌‌కు కుంభమేళా ప్రకటనల హక్కులు

అందులో భాగంగా మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం, స్టాక్స్ కొనడం, Systematic Investment Plan (SIP) చేయడం వంటి లాభదాయక మార్గాలలో పొదుపు చేస్తున్నారు. 2018 లో 4.8 కోట్ల SIP అకౌంట్లకు చేరుకుందంటే ఫైనాన్షియల్ నాలెడ్జి పెరిగి మన వాళ్లు పొదుపు చేయడంలో అప్డేట్ అవుతున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.

 అయితే గతంలో స్టాక్స్, డిబెంచర్లలో మన ఇండియన్స్ తక్కువగా ఉండేవారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సేవింగ్, ఇన్వెస్ట్ మెంట్ హాబిట్స్ మారుతున్నాయి. స్టాక్స్, డిబెంచెర్స్ పదేళ్ల క్రితం మన జీడీపీలో 0.2 శాతం మాత్రమే ఉండగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి 1 శాతానికి చేరుకోవడమే మనవాళ్ల పొదుపు సామర్థ్యం పెరిగింది అనడానికి నిదర్శనం.