రక్షణ వ్యయంలో భారత్ నాలుగో స్థానం

రక్షణ వ్యయంలో భారత్ నాలుగో స్థానం

ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్​ నాలుగో స్థానంలో నిలిచింది. 2022లో భారత్​ ఈ రంగంపై 8360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది, 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్​హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం(సిప్రి) ఈ మేరకు 2024, ఏప్రిల్​ 23న నివేదిక విడుదల చేసింది.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2,44,900 కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8శాతం అధికమని పేర్కొంది. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ వ్యయంలో పెరుగుదల నమోదైంది.

ఆయుధ దిగుమతుల్లో మొదటి స్థానం​ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్​ మొదటి స్థానంలో నిలిచింది. స్టాక్​హోం ఇంటర్నేషనల్​ పీస్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (సిప్రి)  విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం ఆయుధ దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇదేకాలంలో యూరోపియన్ దేశాల్లో 94శాతం పెరిగాయి.

ఈ జాబితాలో భారత్​ తర్వాత సౌదీ అరేబియా, కతార్​ ఉన్నాయి. ఉక్రెయిన్ నాలుగో పెద్ద దిగుమతిదారుడిగా ఉంది. పాకిస్తాన్​ ఐదో స్థానంలో ఉంది. ఇక ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా (42 శాత) ముందున్నది. తర్వాత ఫ్రాన్స్​ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా, జర్మనీ, ఇటలీ ఉన్నాయి.