నిధులు తగ్గినా.. ఫిన్​టెక్ ఫండింగ్​లో భారత్​కు 3వ స్థానం

నిధులు తగ్గినా.. ఫిన్​టెక్ ఫండింగ్​లో భారత్​కు 3వ స్థానం

ట్రాక్షన్​ అనే మార్కెట్​ ఇంటెలిజెన్స్​ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిన్​టెక్​ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్​కు మూడో ర్యాంకు దక్కింది. 2023తో పోలిస్తే 2024లో 33 శాతం మేరకు నిధులు తగ్గినా ఈసారి మూడో స్థానం దక్కించుకున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉండటంతో మొత్తం మీద గిరాకీ తగ్గడంతో ఈ రంగానికీ నిధుల రాక క్షీణించిందని ఈ నివేదిక పేర్కొన్నది.

  •     
  • 2024లో ఫిన్​టెక్​ రంగం 1.9 బిలియన్ డాలర్ల మేరకు సమీకరించింది. 2023లో వచ్చిన 2.8 బిలియన్​ డాలర్లతో పోలిస్తే ఇవి 33 శాతం తక్కువ. నిధుల సమీకరణ విషయంలో ఈ రంగంలో అమెరికా, బ్రిటన్​ తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది.
  •     
  • 2022లో ఫిన్​టెక్ రంగం 5.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. 
  •     
  • 2024లో మూడో త్రైమాసికంలో 805 మిలియన్​ డాలర్లను సమీకరించింది. 2023 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 61 శాతం ఎక్కువ. 
  •     
  • గత ఏడాదిలో వచ్చిన మొత్తం నిధుల్లో ద్వితీయార్థంలో 59 శాతం కనిపించాయి. ఆగస్టులో అత్యధికంగా 434 మిలియన్​ డాలర్ల సమీకరణ జరిగింది. 
  •     
  • ఈ రంగంలో 2024లో రెండు కొత్త యూనికార్న్​లు ఏర్పడ్డాయి.