- ఉదయ్, సచిన్ సెంచరీలు
- నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ
బ్లూమ్‌ఫోంటీన్: వరుస విజయాలతో దుమ్మురేపుతున్న యంగ్ టీమిండియా.. అండర్–19 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బాల్స్‌లో 9 ఫోర్లతో 100), సచిన్ దాస్ (101 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 116) సెంచరీలతో చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన సూపర్ సిక్స్ గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఇండియా 132 రన్స్ తేడాతో నేపాల్‌ను ఓడించింది.
దీంతో 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్ పోరుకు చేరుకుంది. టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 297/5 స్కోరు చేసింది. 62 రన్స్‌కే ఆదర్ష్ సింగ్ (21), అర్షిన్ కులకర్ణి (18), ప్రియాన్షు మోలియా (19) ఔటైనా.. ఉదయ్, సచిన్ నాలుగో వికెట్‌కు 215 రన్స్ జోడించి భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
గుల్షన్ జా 3 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో నేపాల్ 50 ఓవర్లలో 165/9 స్కోరుకే పరిమితమైంది. దేవ్ కనల్ (33) టాప్ స్కోరర్. దీపక్ బోహర (22), అర్జున్ కమల్ (26), దుర్గేశ్ గుప్త (29 నాటౌట్) పోరాడారు. ఆరు రన్స్ తేడాలో ఐదు వికెట్లు పడటంతో నేపాల్ కోలుకోలేకపోయింది. సౌమీ పాండే 4, అర్షిన్ కులకర్ణి 2 వికెట్లు తీశారు. సచిన్ దాస్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.