సింగపూర్ నుంచే ఎక్కువ ఎఫ్‌‌‌‌డీఐలు

సింగపూర్ నుంచే ఎక్కువ ఎఫ్‌‌‌‌డీఐలు

న్యూఢిల్లీ: కిందటి ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి ఇండియా ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ (ఎఫ్‌‌‌‌డీఐలు) అందుకుంది.  ఈ దేశం నుంచి 11.77 బిలియన్ డాలర్లు (ఈక్విటీ సెగ్మెంట్‌‌‌‌లోకి) వచ్చాయి. కానీ,  2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 31.55 శాతం తగ్గాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, మారిషస్‌‌‌‌, సింగపూర్‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌, యూకే, యూఏఈ, కేమాన్ ఐలాండ్స్‌‌‌‌, జర్మనీ, సిప్రస్‌‌‌‌ నుంచి వచ్చిన ఎఫ్‌‌‌‌డీఐలు తగ్గాయి.

 కానీ, జపాన్‌‌‌‌, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఎఫ్‌‌‌‌డీఐలు పెరిగాయి. 2018–19 నుంచి  ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న దేశాల్లో సింగపూర్ ముందుంది. 2017–18 లో ఇండియాలోకి మారిషస్ నుంచి ఎక్కువ ఎప్‌‌‌‌డీఐలు వచ్చాయి.  ఇండియా–మారిషస్ ట్యాక్స్ ఒప్పందంలో సవరణ తర్వాత  ఇండియాలో ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తున్న దేశాల్లో సింగపూర్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌లోకి వచ్చింది.