దేశంలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా రెండు వేలలోపే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,20,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కొత్తగా 1,421 కేసులు నమోదయ్యాయి.కోవిడ్ తో 149 మంది మరణించారు.ప్రస్తుతం దేశంలో 16,187 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 4,30,19,453 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,004 మంది మరణించారు.ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 1,83,20,10,030 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
మరిన్ని వార్తల కోసం