ఒక్క రోజులో 3,641 కరోనా కేసులు.. 11 చావులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య  క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వైద్యారోగ్యశాఖ ఏప్రిల్ 2కు ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ఒక్క రోజే దేశంలో 3, 641 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది.  కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో 11 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి చేరుకుంది. ఈ లెక్కల ప్రకారం.. రోజూవారీ పాజిటివిటీ రేటు 6.12 శాతానికి  చేరుకుంది. ఇప్పటివరకు 4.41 కోట్ల మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 220.66  కోట్ల మందికి కేంద్రం కరోనా వ్యాక్సిన్ ను అందించింది.