దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..కోవిడ్ కారణంగా 206 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 2,02,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 1.9 శాతానికి పడిపోయింది. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,21,24,284కి చేరింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 175.46 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
India registers 16,051 new COVID19 infections & 206 deaths in the last 24 hours: Active caseload stands at 2,02,131
— ANI (@ANI) February 21, 2022
Daily positivity rate at 1.93% pic.twitter.com/uqtlcvbbx3
మరిన్ని వార్తల కోసం