ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసుపై ఘాటుగా స్పందించిన ఇండియా

ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసుపై ఘాటుగా స్పందించిన ఇండియా

న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్ ప్రమేయముందని భారత్పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వెనక్కి తగ్గారు. ఈ హత్య కేసులో భారత్ పై ఆయన అనేక ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంలో భారత్ ప్రమేయం ఉన్నట్టు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. అయితే హత్యకు సంబంధించిన నిఘా సమాచారాన్నే తాము భారత్ తో పంచుకున్నామని ఎలాంటి ఆధారాలను తాము భారత్ కు ఇవ్వలేదని వెల్లడించారు. ఈ అంశంలో భారత్ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

అయితే కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత  విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.