గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. హమాస్ బందీలను విడుదల చేయకపోవడం, అమెరికా మధ్వర్తిగా ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి గాజాపై విరుచుకుపడింది. మంగళవారం జరిపిన దాడుల్లో 400 మంది మృతిచెందగా..వందలాది మంది గాయపడ్డారు. తాజాగా బుధవారం(మార్చి19) తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 14 మంది చనిపోయారు. గాజాపై దాడులు మరింత ముమ్మురం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై భారత్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయాలని భారత్ పిలుపునిచ్చింది. గాజా ప్రజలకు ప్రస్తుతం నిరంతర మానవతా సహాయం అవసరమని నొక్కి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Xలో పోస్ట్ షేర్ చేశారు. గాజాలో పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. గాజాలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం చాలా అవసరం. గాజా ప్రజలకు నిరంతరం మానవతా సహాయం అందించాలని మేం కోరుతున్నామని అని జైస్వాల్ Xలో పోస్ట్ రాశారు.
ALSO READ | ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన వెంటనే.. సునీతా విలియమ్స్ను ఎక్కడకు తీసుకెళ్లారంటే..
మరోవైపు గాజాపై దాడులు మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ ,ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద కార్యకలాపాలలో ఉపయోగించే నౌకలను లక్ష్యంగా గాజా తీరం వెంబడి దాడులు చేస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు హమాస్ ప్రయత్నిస్తోంది. అందుకే బుధవారం రాత్రి ఉత్తర గాజా హమాస్ సైనిక స్థావరంపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. దీంతోపాటు గాజా తీర ప్రాంతంలోని నౌకలపై మిస్సైల్స్తో విరుచుకుపడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో గాజాకు తక్షణ నిరంతర సాయం అవసరమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు హమాస్ చేతిలో బందీలుగా వారందరిని విడుదల చేయడం పరిష్కార మార్గమని భారత్ సూచించింది.