ఉక్రెయిన్ లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దుల్లో రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. లివివ్లోని మిలిటరీ బేస్ వద్ద ఎనిమిది మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 57మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పొరుగున ఉన్న పోలాండ్కు తరలించింది. భద్రతా కారణాలు, రోజు రోజుకు పెరుగుతున్న బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. త్వరలో పరిస్థితులను సమీక్షించి మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.