భారత్‌లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

భారత్‌లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

భారత్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 14వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 13,405 కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 235 మంది మరణించారు. 34,226 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది. ప్రస్తుతం దేశంలో లక్షా 81వేల 75 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి నాలుగు ోట్ల 21 లక్షల 58వేల 510 మంది కోలుకున్నారు. ఇక వైరస్ కారణంగా 5లక్షల 12వేల 344 మంది చనిపోయారు. 

మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే జనాభాలో 80 శాతం అర్హత గల వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ 80 శాతం మందికి పూర్తయింది. మరో వైపు టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు, రెండుకోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు 1,75,83,27,441మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.