ఒక్క రోజే రెండున్నర లక్షల కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2 లక్షల 58వేల 89  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 385 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకు 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  కరోనా వైరస్ నుంచి లక్షా 51 వేల 740 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో 16 లక్షల 56వేల 341యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు  ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కు చేరింది. 

మరోవైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇప్పటికే తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.