భారత్లో కొత్తగా 3,06,064 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,064 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తగ్గాయి. తాజాగా కోవిడ్ బారిన పడి 439 మంది మరణించారు. ఇక మరో రెండు లక్షల 43వేల 495 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 లక్షల 49వేల 335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. 

మరోవైపు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 71.69 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 14,74,753 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 162.26 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశంలో రికవరీ రేటు 93.07% శాతానికి చేరుకోగా వారంవారీ పాజిటివిటీ రేట్ 17.03% శాతంగా నమోదు అయింది.