న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,714 మంది కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ కారణంగా ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 2,513 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 26,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 194కోట్ల 27 లక్షల టీకాలు పంపిణీ చేశారు.
#COVID19 | India reports 3,714 fresh cases, 2,513 recoveries, and 7 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 7, 2022
Total active cases are 26,976 pic.twitter.com/mZIs8dP73f
ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 8.8శాతంగా ఉంది. ఇది మహారాష్ట్ర సగటుకు రెట్టింపు కావడం విసేషం. థానేలో ఆదివారం పాజిటివిటీ రేటు 10శాతంగా ఉండగా.. సోమవారం అది 20శాతానికి చేరింది. ఆరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టెస్టుల సంఖ్య పెంచారు.