భారత్‌లో తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5921 కొత్త కరోనా పాజిటివ్  కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి తాజాగా 11,651 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 289 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 63,878 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక డైలీ పాజిటివ్ రేటు 0.63 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,23,78,721 కోలుకున్నారు. కరోనా మరణాల సంఖ్య 5,14,878కు చేరింది. ఇప్పటివరకు 1,78,55,66,940మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 

కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. 77.19 పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 9,40,905 టెస్టులు నిర్వహించారు.దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 77,19,14,261 మందికి టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 3309 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశ వ్యాప్తంగా 1426 ప్రభుత్వ లాబ్స్, 1883 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.