టీ20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు బౌలింగ్ లో అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీ తేడాతో ఓడిపోయిన మన జట్టు.. దాయాధి పాకిస్థాన్ పై సత్తా చాటింది. బౌలర్లందరూ క్రమశిక్షణతో, సమిష్టిగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన నిదా దార్ టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు.. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. రేణుక ఠాకూర్, దీప్తి శర్మ, ఆశ శోభన లకు తలో వికెట్ లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కు సరైన ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్ చివరి బంతికి రేణుక ఠాకూర్ పాక్ ఓపెనర్ ఫిరోజ్ ను డకౌట్ చేసింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అమీన్, సోహైల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. క్రీజ్ లో ఉన్నత సేపు ఇబంది పడ్డ మునీబా అలీ 26 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయింది. పాక్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతోనే వచ్చింది. సీనియర్ ప్లేయర్ నిదా దార్ భారత బౌలర్లను ప్రతిఘటించడంతో పాకిస్థాన్ 100 పరుగుల స్కోర్ దాటింది. అరూబ్ షా 14 చేసి పర్వాలేదనిపించింది.
Also Read :- ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. స్టార్ ప్లేయర్లతో పటిష్టంగా పాకిస్థాన్
ఈ మ్యాచ్ లో భారత్ రన్ రేట్ తో గెలవడం చాలా కీలకం. గ్రూప్ మ్యాచ్ లో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 58 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. దీంతో సెమీస్ రేస్ ఆసక్తికరంగా మారింది.
PAKISTAN TEAM FINISHES WITH 105/8
— The Khel India (@TheKhelIndia) October 6, 2024
India needs to chase 106 as fast as possible for better run rate, C'mon Girls...l!! 🇮🇳 pic.twitter.com/Dhn30DRxEV