జింబాబ్వే టూర్ లో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. సమిష్టిగా రాణించి ఆతిధ్య జట్టును 115 పరుగులకే కట్టడి చేశారు. 29 పరుగులు చేసిన క్లివ్ మందండే టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. పవర్ ప్లే లో జింబాబ్వే చక చక పరుగులు సమర్పించుకున్న ఆ తర్వాత తేలిపోయింది. దీంతో భారత్ ముందు కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకుంది. రెండో ఓవర్లోనే ముఖేష్ కుమార్ తన తొలి బంతికి కియా (0) వికెట్ తీసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. ఈ దశలో మాధవీరె(21), బెన్నెట్(23) జింబాబ్వేను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 34 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే పవర్ ప్లే చివరి ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ రావడంతో ఆతిధ్య జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక్కడ నుంచి వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లను కోల్పోయింది.
జోనాథన్ కాంప్‌బెల్(0), క్లైవ్ మదాండే(12), ల్యూక్ జోంగ్వే(1), బ్లెస్సింగ్ ముజారబానీ(0) వరుస పెట్టి పెవిలియన్ కు చేరారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సికందర్ రజా 17 పరుగులకే ఔటవ్వడంతో జింబాబ్వే 115 పరుగులకే పరిమితమైంది. చివర్లో మాదందే (29) ఆదుకోవడంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్ టన్ సుందర్ కు రెండు వికెట్లు దక్కాయి.