న్యూఢిల్లీ: ధరలు దారికొచ్చాయి. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయి 5.22 శాతానికి తగ్గింది. ఇది నవంబర్‌లో 5.48 శాతంగా ఉంది. చాలా రకాల ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతం, డిసెంబర్ 2023లో 5.69 శాతంగా ఉంది.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఫుడ్బాస్కెట్ఇన్ఫ్లేషన్ డిసెంబర్‌లో 8.39 శాతానికి తగ్గింది. ఇది నవంబర్‌లో 9.04 శాతం, డిసెంబర్ 2023లో 9.53 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ అంచనాను ఆర్బీఐ గత నెల 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. ఇన్ఫ్లేషన్తగ్గడంతో ఆర్బీఐ వడ్డీరేట్లకు కోత పెడుతుందని భావిస్తున్నారు.