భారత్ రెజ్లర్లు  బజరంగ్ పునియా, వినేష్ ఫొగట్ రాజీనామా ఆమోదం

భారత్ రెజ్లర్లు  బజరంగ్ పునియా, వినేష్ ఫొగట్ రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ: రైల్వేలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ భారత్ రెజ్లర్లు  బజరంగ్ పునియా, వినేష్ ఫొగట్ ఇచ్చిన లేఖలను రైల్వేశాఖ ఆమోదించింది. ఈ మేరకు రైల్వే వర్గాలు సమాచారమిచ్చాయి. వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. నిజానికి రాజీనామా చేసిన తర్వాత నోటీస్ పిరియడ్ ఉంటుందని, కానీ రెజర్ల నిర్ణయం మేరకు వారిని రిలీవ్ చేస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిజానికి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫొగట్ కు రిలీవ్ లెటర్ అవసరం. కానీ రైల్వే శాఖ  ఆమె రాజీనామాను ఆమోదించడంతో ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు తొలిగాయి.  కాగా ఇద్దరు రెజ్లర్లు నార్త్ రైల్వేలో విధులు నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ALSO READ | ఒలింపిక్స్‌లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్‌కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్