
- ఆయన సంపద రూ. 3,400 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత రిచెస్ట్ఎమ్మెల్యేగా ముంబైలోని ఘాట్కోపర్కు చెందిన పరాగ్షా నిలిచారు. బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ. 3,400 కోట్లుగా అంచనా. ఆ తర్వాతి స్థానంలో రూ. 1,413 కోట్ల సంపదతో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను అసోసియేషన్ఫర్డెమొక్రటిక్ రిఫార్స్మ్ ( ఏడీఆర్) పరిశీలించింది.
28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యాన్ని విశ్లేషించింది. అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఇండాస్ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన సంపద కేవలం రూ. 1700 అని ఏడీఆర్ తేల్చింది.