IND vs ENG: అహ్మదాబాద్‌లో దంచి కొట్టిన టీమిండియా.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం

IND vs ENG: అహ్మదాబాద్‌లో దంచి కొట్టిన టీమిండియా.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ రెచ్చిపోయింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను మన బ్యాటర్లు ఉతికి ఆరేశారు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారీ స్కోర్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గిల్ సెంచరీ( 102 బంతుల్లో 112: 14 ఫోర్లు.. 3 సిక్సర్లు)తో పాటు శ్రేయాస్ అయ్యర్(78), కోహ్లీ (52) హాఫ్ సెంచరీలు చేసి రాణించారు.            

గిల్, కోహ్లీ భారీ భాగస్వామ్యం:

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో రోహిత్ శర్మ కేవలం ఒక పరుగే చేసి ఔటయ్యాడు. ఈ దశలో గిల్ కు జత కలిసిన విరాట్ కోహ్లీ జట్టును ముందుకు నడిపించారు. రెండో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కోహ్లీ, గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కోహ్లీ ఔటైనా అయ్యర్ తో కలిసి గిల్ మరొక కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో వికెట్ కు శ్రేయాస్ తో కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్ ఆదిల్ రషీద్ విడగొట్టాడు. 

Also Read :- ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్‌న్యూస్

సెంచరీ చేసి ఊపు మీదున్న గిల్ ను బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి అయ్యర్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (17), అక్షర్ పటేల్ (13) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. చివర్లో రాహుల్ 40 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 350 పరుగుల మార్క్ అందుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సాకిబ్, మార్క్ వుడ్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.