చరిత్ర సృష్టించిన భారత్..చెస్ ఒలింపియాడ్ లో 2స్వర్ణాలు

చరిత్ర సృష్టించిన భారత్..చెస్ ఒలింపియాడ్ లో 2స్వర్ణాలు

45వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆఖరి రౌండ్లో ప్రత్యర్థులను మట్టికరిపించి.. అటు పురుషుల జట్టు.. ఇటు మహిళల జట్టు బంగారు పతకాలు సాధించాయి. 

45వ చెస్ ఒలింపియాడ్ లో ఆఖరి రౌండ్ లో తమ అపోనెంట్ లను ఓడించి పురుషులు, మహిళల జట్లు రెండు విభాగాల్లో తొలి బంగారు పతకాలను కైవసం చేసు కున్నాయి. ఆదివారం ( సెప్టెంబర్ 22) న హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో పురుషులు, మహిళల జట్లు పోటీ పడి మరీ విజయం సాధించాయి. 

ALSO READ | చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియా జైత్రయాత్ర

పురుషుల చెస్ ఆఖరి రౌండ్ లో డి గుకేష్, అర్జున్ ఎరిగైసి, ప్రగ్నానందల జట్టు.. ప్రత్యర్థి పురుషుల జట్టు స్లోవేకియాను ఓడించింది. మరోవైపు అజర్‌బైజాన్‌పై 3.5-0.5తో విజయం సాధించిన భారత మహిళలు దేశానికి అరుదైన డబుల్ స్వర్ణాన్ని అందించారు.

ఇంతకుముందు ఇదే టోర్నీలో 2014, 2022లో భారత పురుషుల జట్టు రెండు కాంస్యాలను సాధించింది. 2022లో చెన్నైలో జరిగిన ఒలింపియాడ్ ఎడిషన్ మహిళల జట్టు కాంస్యం గెలుచుకుంది.